టీపీసీసీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పై అవగాహన – శిక్షణ శిబిరం

June 13, 2026 | తెలంగాణ

బిచ్కుంద జూన్ 13 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) కోసం ఏర్పాటు చేసిన అవగాహన మరియు శిక్షణ శిబిరంలో జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతరావు టిపిసిసి జనరల్ సెక్రెటరీ మరియు జుక్కల్ నియోజకవర్గ అబ్జర్వర్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా BLAలు కృషి చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఓటర్ల జాబితా కీలకమని పేర్కొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా , డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ,నవీన్ పెట్టాం , ఏఎంసీ చైర్మన్లు కవిత ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ సీమా సెట్ కార్, బిచ్కుంద మండల పార్టీ అధ్యక్షుడు నాగనాథ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విఠల్ రెడ్డి బిచ్కుంద మండల పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి జుక్కల్ మండల్ పార్టీ అధ్యక్షుడు రమేష్ దేశాయ్ మద్నూర్ మండల అధ్యక్షుడు సాయిలు కోడప్పగల్ మండల అధ్యక్షుడు శ్యామ్ పటేల్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు పండరి డోంగ్లి మండల అధ్యక్షులు దేశాయ్,సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, BLA ల ఏజెంట్స్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper