తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా
జనం న్యూస్ 03 ఆగస్టు 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఇంచార్జ్ వేములవాడ మదన్ మోహన్ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు ఉప్పరి గంగాధర్ జిల్లా కమిటీలు మండల కమిటీలు మరియు గ్రామ కమిటీ సభ్యులందరికీ శుభోదయం శుభదిన శుభాకాంక్షలు. మన ఉద్యమం కేవలం రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, సామాజిక మార్పు కోసం సాగుతున్న మహత్తర ఉద్యమం. ప్రతి రోజు ఒక కొత్త ఆలోచనతో ప్రజల్లోకి వెళ్లి మన సిద్ధాంతాలను వారికి చేరవేయడం వారి సమస్యలను తెలుసుకోవడం వాటి పరిష్కారానికి కృషి చేయడం మన అందరి ప్రధాన బాధ్యతప్రజలతో నిరంతర సంబంధాలు పెంపొందించుకుంటూ వారి ఆశలు ఆకాంక్షలు సమస్యలను అర్థం చేసుకొని రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఈ దిశగా జిల్లా కమిటీలు మండల కమిటీలు మరియు గ్రామ కమిటీలు మరింత చురుకుగా సమన్వయంతో పనిచేయడం అత్యంత అవసరం.బీసీల రాజ్యం స్థాపన అయ్యే వరకు మన పోరాటం నిరంతరం కొనసాగాలి. మన ఐక్యత మన కృషి మన అంకితభావమే భవిష్యత్ విజయానికి పునాది అవుతాయి. 2029 సంవత్సరంలో తెలంగాణలో బీసీల రాజ్యాధికారాన్ని సాధించాలనే మహత్తర లక్ష్యంతో మనమందరం కలిసికట్టుగా క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేయాలి.రాజ్యాధికార సాధన దిశగా ప్రతి కార్యకర్త ఒక నాయకుడిగా ప్రతి నాయకుడు ఒక ఉద్యమకారుడిగా ప్రజల్లోకి వెళ్లి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేయాలని మీ అందరికీ హృదయపూర్వక విన్నపం చేస్తున్నాను జై తెలంగాణజై బీసీ రాజ్యాధికారంజై తెలంగాణ రాజ్యాధికార పార్టీవేములవాడ మదన్ మోహన్రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్తెలంగాణ రాజ్యాధికార పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూరు ఉప్పరి గంగాధర్ 9505177440