నూతన మండల అధ్యక్షుడికి ఘన సన్మానం – 10వ తరగతిటాపర్ విద్యార్థినికి సన్మానం

June 13, 2026 | తెలంగాణ

జుక్కల్ జూన్ 13 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని పెద్ద కొడప్గల్ మండలం వడ్లం గ్రామానికి చెందిన పెద్ద కొడప్గల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు మాధప్పవర్ శామప్ప ని జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మరియు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన శామప్ప కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు ఆకాంక్షించారు.అనంతరం గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచిన ప్రతిభావంతురాలైన విద్యార్థినిని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ శాలువాతో సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించడం అభినందనీయమని, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థినికి ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper