యూరియా యాప్ పై బుకింగ్ వివరాలు ఎప్పటికప్పుడు రైతులకు తెలపాలి

June 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 13 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే సహించేది లేదు కేటి దొడ్డి మండల నాయకులు గాజుల కృష్ణ రెడ్డి, నక్క రవి జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో రానున్న వర్షాకాలం (ఖరీఫ్) సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ముందస్తు అన్ని ఏర్పాట్లు చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ప్రజా ప్రతినిధులను కోరారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రైతుల అవసరాలకు అనుగుణంగా యూరియా డీఏపీ మరియు ఇతర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని, కోరారు రానున్న వర్షాకాలంలో సాగు విస్తీర్ణం పంటల ఎంపిక, విత్తనాలు మరియు ఎరువుల అవసరాలపై అధికారులు వివరాలు ఎప్పటికి అప్పుడు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సమయానికి అందేలా వ్యవసాయ శాఖతో పాటు పీఏసీఎస్ సంస్థలు సమన్వయంతో రైతులకు ఇబ్బంది లేకుండా పని చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఎరువుల కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రైతులకు అందిస్తున్న వ్యవసాయ పథకాలపై విస్తృత అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు తద్వారా రైతులకు సౌకర్యవంతంగా సేవలు అందుతాయని పేర్కొన్నారు

🌐 Select Language:
📰 ePaper