చోరి కేసును చేదించిన మల్దకల్ పోలీసులు.‌.నిందితులు అరెస్ట్

June 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 13 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్:మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ గ్రామ బస్టాండ్ సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న సిరి ట్రేడర్స్ ఎలక్ట్రికల్ దుకాణంలో రాత్రి వేళ జరిగిన చోరీ కేసును మల్దకల్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.జూన్ 8వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దుకాణం వెనుక తలుపుల స్క్రూలను తొలగించి లోపలికి ప్రవేశించి క్యాష్ కౌంటర్ నుండి రూ. 53,000 నగదును దొంగిలించారు. బాధితుడు లబ్బరి దినకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్దకల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 95/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ నేరానికి పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కర్నూలుకు చెందిన ఆటో డ్రైవర్ యం వంశీ @ మాల వంశీ (31), మరియు కార్ డ్రైవర్ మాల వెంకటేష్ (33) లను పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. తేదీ 12.06.2026 ఉదయం తాటికుంట స్టేజ్ సమీపంలో సబ్-ఇన్‌స్పెక్టర్ కె శ్రీహరి మరియు సిబ్బంది వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించిన నిందితులను పోలీసులు పట్టుకుని విచారించగా ఈ చోరీ వివరాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో నిందితులు ఇద్దరూ తమ జల్సాల కోసం అప్పులు తీర్చడం కోసం ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుడైన వంశీపై గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు తేలింది.నిందితుల వద్ద నుండి చోరీకి గురైన సొమ్ములో మిగిలిన మొత్తం రూ 40,200 నగదును, నేరానికి ఉపయోగించిన హరూన్ బజాజ్ ఆటోను నెం. ఎపి-39-టీ క్యూ-0761 మరియు తలుపులు తెరవడానికి వాడిన రెండు స్పానర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నేరసమ్మతి వాంగ్మూలాన్ని రికార్డు చేసి రికవరీ పంచనామా అనంతరం వారిని గద్వాల్ కోర్టులో హాజరు పరచడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper