విద్యార్థులకు శుభ్రమైన పౌష్టికాహారం అందించాలి ఎంఈవో విట్టల్

June 13, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 13 చిలిపిచేడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల  పరిధిలోని పీఎం పోషణ (మధ్యాహ్న భోజన పథకం) అమలుపై కుక్ కమ్ హెల్పర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు మండల విద్యాశాఖ అధికారి విట్టల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రతిరోజూ శుభ్రమైన, నాణ్యమైన మరియు పౌష్టికాహారం అందించడంలో కుక్ కమ్ హెల్పర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వంటశాలలు, వంట పాత్రలు, నీటి ట్యాంకులు పరిశుభ్రంగా ఉంచాలని, ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని సూచించారు.పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటి రోజు నుంచే మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులైన ప్రతి విద్యార్థికి భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వంట సమయంలో పరిశుభ్రత ప్రమాణాలను పాటించి, ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.సమావేశంలో రమేష్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఆదినారాయణ ఇన్‌చార్జ్ హెచ్‌ఎం, నాగేందర్ రెడ్డి ఆర్‌పీ, ఇమ్రాన్ అలీ ఆర్‌పీ, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సీఆర్‌పీలు మరియు కుక్ కమ్ హెల్పర్లు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper