మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం
,జనం న్యూస్: ఆగస్టు 3 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) ఉమ్మడి ఆంధ్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి రాజమహేంద్రవరం విమానాశ్రయంలో భాజపా నాయకులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, పార్టీ సీనియర్ నాయకులు ఏపీఆర్ చౌదరి, నీరుకొండ వీరన్న చౌదరి, రజని, ఇతర నాయకులు కేవి సత్యనారాయణ రెడ్డి తదితరులు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.విమానాశ్రయం నుంచి బయలుదేరిన కిరణ్ కుమార్ రెడ్డికి మార్గమధ్యంలో పార్టీ కార్యకర్తలు పూలదండలతో స్వాగతం పలికారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు.