రాపోలు పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతులకు ఇన్‌చార్జి ఆయా నియామకం

August 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 03 ఆగస్టు వికారాబాద్ జిల్లా :- పరిగి మండల పరిధిలోని రాపోలు ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ తరగతుల విద్యార్థుల కోసం నూతనంగా ఇన్‌చార్జి ఆయాను నియమించినట్లు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గండు వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. చిన్నారుల సంరక్షణ, పాఠశాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు తల్లిదండ్రుల్లో నమ్మకం కల్పించేందుకు అందరూ సహకరించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. చిన్నారులకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఇన్‌చార్జి ఆయాకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షుడు ఉపాధి రాకేష్, కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ ఎర్రవండ్ల రవి, బీఆర్‌ఎస్ నాయకులు గండు రాధాకృష్ణ, గండు అశోక్, మీనా కుమార్, గండు బాలకృష్ణయ్య, కొమిరి చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper