శక్తి భవనానికి శంకుస్థాపన
జనం న్యూస్ 2026, సెప్టెంబర్ 09, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని,
కొల్లూరు గ్రామంలో, నూతనంగా నిర్మించనున్న మహిళా శక్తి భవనానికి, ఘనంగా భూమి పూజ నిర్వహించారు.ఈ భూమి పూజ కార్యక్రమానికి, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 10 లక్షల రూపాయల వ్యయంతో, నిర్మించనున్న ఈ మహిళా శక్తి భవనంలో, మహిళా సంఘాల సమావేశాలు, కుట్టు మిషన్ లో శిక్షణ, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనుటకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహించుటకు ఉపయోగ పడుతుందన్నారు. దీనివల్ల వందలాదిమంది మహిళలకు ఉపాధి, మరియు ఆత్మగౌరవం లభిస్తుందని తెలిపారు. అదేవిధంగా మహిళ స్వయం సహాయక సంఘాల సభ్యురాళ్ళు మాట్లాడుతూ, ఈ భవన నిర్మాణంతో, మహిళలకు ఒక ప్రత్యేక వేదిక దొరుకుతుందని, స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలను గౌరవించి ప్రత్యేక భవనాన్ని ఏర్పాటు చేసినందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ఈ కార్య క్రమానికి, పంచాయతీ కార్యదర్శి రవి, మరియు వార్డు సభ్యులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.