సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన
జనం న్యూస్ 26మే పెగడపల్లి మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని ల్యాగలమర్రి గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎలుకతుర్తి రవితో కలిసి ఐకెపి మహిళా వి ఒ సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన పెగడపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ అనంతరం మాట్లాడుతూతెలంగాణ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదన మేరకు పెగడపల్లి మండలంలో 23 గ్రామాలకు గాను 33 వివో సంఘ భవనాలు నిర్మాణం చేయడానికి మంజూరు ఇచ్చారని అందులో భాగంగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఆన్లైన్ ద్వారా ఒకవైపు సంఘాలను ప్రారంభిస్తూ అన్ని మండల కేంద్రాల్లో వివిధ గ్రామాలకు మంజూరు ఇచ్చిన గ్రామాల్లో వివో సంఘ భవనాలకు భూమి పూజ చేయాలని ఆదేశాల మేరకు శంకుస్థాపన చేయడం జరిగిందని వివరించారు. దాదాపు మనం పెగడపల్లి మండలంలో మూడు కోట్ల 30 లక్షల రూపాయల విలువగల సంఘ భవనాలు నిర్మాణం కోసం ఈ రోజు వివిధ గ్రామాలలో సర్పంచులు స్థానిక మహిళ వివో అధ్యక్షులు మరియు సీసీలు ఏపిఎం ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెట్ల కిషన్ వివో సంఘం అధ్యక్షురాలు రాణి మహిళా సంఘాల ప్రతినిధులు పంచాయతీ కార్యదర్శి శంకర్ సి ఏ దేవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కల్లేపల్లి రాజు నాయకులు పాపిరెడ్డి కోల రాజయ్య గ్రామస్తులు పాల్గొన్నారు.