క్రైస్తవ హక్కుల పరిరక్షణ జీవితకాల పురస్కారం అందుకున్న విలియం కేరి
జనం న్యూస్ మే 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం హన్మకొండ జిల్లా కేంద్రంలో క్రైస్తవ హక్కుల రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిషప్ డా. జన్ను యిర్మియా ఆదేశాల మేరకు, హనుమకొండ జిల్లా జ్యోతి బస్ నగర్ కాలనీ, పెద్దమ్మ గడ్డలోని జీసస్ ఇన్ కల్వరి మినిస్ట్రీస్ చర్చి నందు చేరికల సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్రైస్తవ హక్కుల రక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పుల్లా మదు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లాకు నూతన కమిటీని ప్రకటించారు అదే విధంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించి న పలువురిని ఘనంగా సన్మానించి క్రైస్తవ హక్కుల జీవితకాల పురస్కార అవార్డులను అందజేశారు.అవార్డు గ్రహీతలు కే అశోక్ పాల్ , సరిగొమ్ముల దీన్ దయాల్, రెవ. పెండేలా విలియం కేరి, మాట్ల రాజు , రెవ. నిరీక్షణ, రెవ. సీయోను రాజు ఈ కార్యక్రమంలో బిషప్ డా. జన్ను యిర్మియా వ్యవస్థాపక అధ్యక్షులు, క్రైస్తవ హక్కుల రక్షణ సమితి రెవ. కే. అశోక్ పాల్ నేషనల్ చీఫ్ అడ్వైజర్ సరిగొమ్ముల దీన్ దయాల్ చైర్మన్, వరంగల్ క్రిస్టియన్స్ సొసైటీ మాజీ కార్పొరేటర్ బోడా డిన్న , రెవ. పి విలియం కేరి రెండు తెలుగు రాష్ట్రాల ఇన్చార్జులు కొడవటి రవి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ, రెండు తెలుగు రాష్ట్రాలు రెవ. కోట జాషువా నేషనల్ ఆర్గనైజర్ సమావేశంలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ, సంఘ ఐక్యత, సేవా కార్యక్రమాలపై చర్చించారు నూతన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు….