విత్తనాలు మరియు ఎరువుల దుకాణాలపై టాస్క్ ఫోర్స్ బృందం తనిఖీలు.

May 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 29మే పెగడపల్లి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని పలు దుకాణనాలలో నాణ్యత నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పెగడపల్లి మండల టాస్క్ ఫోర్స్ బృందం శ్రీకాంత్ MAO, కిరణ్ కుమార్ SI మండలంలోని విత్తనాలు మరియు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది.తనిఖీల సందర్భంగా డీలర్లకు అనుమతించిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, హెచ్.టి. పత్తి విత్తనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించ రాదని ఆదేశించారు. అలాగే విత్తనాలు మరియు ఎరువుల విక్రయాల సమయంలో తప్పనిసరిగా రసీదులు ఇవ్వాలని సూచించారు.ఎరువులను గరిష్ట చిల్లర ధర (ఎం ఆర్ పి ) కంటేఅధికధరలకువిక్రయించరాదని, నిర్ణయించిన ధరలకే రైతులకు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చేయడం మరియు రైతుల ప్రయోజనాలను కాపాడడం లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper