స్వేరోస్ అడహాక్ గద్వాల టౌన్ నూతన కమిటీ ఎన్నిక
జనం న్యూస్ 01 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని యస్ వి యం డిగ్రీ కళాశాల యందు స్వేరోస్ నూతన గద్వాల టౌన్ కమిటీని రాష్ట్ర కమిటీ సభ్యులు దేవన్న,మరియు జిల్లా ఉపాధ్యక్షుడు రఫీ ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది అక్షరం ఆరోగ్యం ఆర్థికం ధ్యేయంగా జ్ఞాన సమాజ నిర్మాణం కోసం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాపించిన స్వేరో సంస్థ స్వేరోస్ నెట్వర్క్ అక్షరం ఆరోగ్యం ఆర్థికం అనే నినాదాలు పైన పనిచేస్తుందని,స్వేరోస్ నెట్వర్క్ భవిష్యత్తు సంస్కృతిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రతి ఒక్కరు పది ఆజ్ఞలను అదేవిధంగా ప్రతి శనివారం ప్రేరణ ప్రోటోకాల్* నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అనంతరం నూతన గద్వాల టౌన్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులు తరుణ్ ఉపాధ్యక్షులుగా యుగేందరు అదిల్ ప్రధాన కార్యదర్శిగా నవీదు అధికార ప్రతినిధిగా శ్రీకాంత్ కోశాధికారిగా అజయ్ ఆర్గనైజ్ సెక్రెటరీగా ప్రవీణ్ కమిటీ సభ్యులుగా రెహమత్ శాలిమియా గణేష్ హైమద్ ఖాన్ వసంత్ నరేష్ సోయల్ వసంత్ వెంకటేష్ చరణ్ ఈశ్వర్