జోగుళాంబ గద్వాల రైల్వే స్టేషన్‌లో వీల్ చైర్, ఎలక్ట్రిక్ వాహన సౌకర్యం కల్పించాలని ఉదయ్ టీం డిమాండ్

June 2, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 02 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; జోగులాంబ గద్వాల గద్వాల రైల్వే స్టేషన్‌లో దివ్యాంగులు, వృద్ధులు సీనియర్ సిటిజన్లు మరియు గర్భిణీ స్త్రీల సౌకర్యార్థం ప్లాట్‌ఫారమ్‌లపైకి వెళ్లడానికి కనీస సౌకర్యాలైన వీల్ చైర్స్ మరియు ఎలక్ట్రిక్ వాహనం అందుబాటులో ఉంచాలని కోరుతూ ఈరోజు ఉదయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ మాస్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. సుగమ్య భారత్ అభియాన్ నిబంధనల ప్రకారం ప్రతి ప్రధాన స్టేషన్‌లో ఈ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలని, గద్వాల స్టేషన్‌లో తగినన్ని వీల్ చైర్లతో పాటు ప్లాట్‌ఫారమ్‌లపై తిరగడానికి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కేటాయించాలని ఉదయ్ టీం డిమాండ్ చేసింది. దీనిపై స్టేషన్ మాస్టర్ సానుకూలంగా స్పందిస్తూ, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే వీల్ చైర్ సౌకర్యం అందుబాటులోకి వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ టీం ప్రతినిధులు మరియు గద్వాల జిల్లా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇట్లు యం శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ్ అసోసియేషన్.

🌐 Select Language:
📰 ePaper