కేపీహెచ్‌బీలో క్షత్రియ క్రీడోత్సవాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

June 13, 2026 | తెలంగాణ

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడం అభినందనీయమం

జనం న్యూస్ మే 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కేపీహెచ్‌బీ కాలనీలో ఉన్న అల్లూరి సీతారామరాజు స్పోర్ట్స్ గ్రౌండ్‌లో క్షత్రియ క్రీడోత్సవం కమిటీ ఆధ్వర్యంలో డి.వి.ఎస్. వర్మ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న వాలీబాల్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందిం చేందుకు క్షత్రియ క్రీడోత్సవం కమిటీ చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కూడా అందిస్తాయని పేర్కొన్నారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.ప్రతి విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న క్రీడలో రోజుకు కనీసం ఒక గంట సమయం కేటాయించేలా ప్రోత్సహించాలని, దీనివల్ల శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన వ్యాయామాన్ని దినచర్యలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని సూచించారు.క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తూ యువతను సరైన దిశలో నడిపించే ఇటువంటి కార్యక్రమాలు సమాజాభివృద్ధికి దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు, శ్యామల రాజు, మైనర్ రాజు, డి.ఎస్. రాజు, భీమరాజు వెంకటేశ్వరరాజుతో పాటు ఎస్.ఆర్. స్పోర్ట్స్ సభ్యులు, క్షత్రియ యూత్ ఫెడరేషన్ సభ్యులు, క్రీడాకారులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

🌐 Select Language:
📰 ePaper