మెరుగైన వైద్య సేవల కోసం ఎల్ఓసి అందజేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి
జనం న్యూస్ : వనపర్తి వనపర్తి డివిజన్ రిపోర్ట ర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 13 2026 గోపాల్పేట్ మండలం తాడిపత్రి గ్రామానికి చెందిన శేఖర్ కూతురు లాస్య కు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో శుక్రవారం మహాత్మ జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు రూ.2,50,000 ఎల్ఓసీని అందజేశారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేయాలని ఆలోచనతో ఎల్ఓసి అందజేస్తుందని , ఎల్ఓసి సహాయం బాధిత కుటుంబాలకుఎంతో ఊరట నిస్తుందని అన్నారు. ప్రజల కష్టసుఖాల్లో అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తానని చిన్నారెడ్డి గారు తెలిపారు. అవసరమైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఎల్ ఓ సి అందుకున్న బాధిత కుటుంబ సభ్యులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య పాల్గొన్నారు.End