108 సిబ్బంది నిజాయితీ- మృతురాలి బంగారు ఆభరణాలు పోలీసులకి అందజేత
జనం న్యూస్- జూన్ 13- నాగార్జునసాగర్ టౌన్- రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను నిజాయితీగా పోలీసులకు అందజేసిన నాగార్జునసాగర్ 108 ఈఎంటి గోవర్ధన్, పైలట్ రాజేష్ లు, నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ బైపాస్ రోడ్ లోని సమాధుల వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో (రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొట్టుకున్న ఘటనలో) మృతురాలి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను 108 అత్యవసర సేవల సిబ్బంది గమనించి ఆభరణాలను భద్రపరచి స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి ఆవరణలో డ్యూటీ డాక్టర్ చక్రవర్తి సమక్షంలో నాగార్జునసాగర్ టౌన్ ఎస్సై సతీష్ కు అందించారు.పోలీసులు మరియు స్థానికుల అభినందనలుఆపద సమయంలో ప్రాణాలు కాపాడటమే కాకుండా బాధితుల సొత్తుకు రక్షణగా నిలిచిన 108 సిబ్బంది నిజాయితీని స్థానిక టౌన్ ఎస్ఐ సతీష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నగలను చట్టపరమైన ప్రక్రియ అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులు అందిస్తామని ఆయన తెలిపారు.నేటి సమాజంలో ఇటువంటి విలువలు కలిగిన సిబ్బంది ఉండటం గర్వకారణమని స్థానికులు 108 ఈఏంటి గోవర్ధన్, పైలెట్ రాజేష్ లను అభినందించారు.