ఆక్వా రైతుల సమస్యలపై కలెక్టర్ కు వినతి…
జనం న్యూస్ సెప్టెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఏకపక్ష ఫీడ్ ధరల పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి
ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ స్టేట్ ఆక్వా ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వారికి మరియు జాయింట్ కలెక్టర్ వారికి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో)కి వినతిపత్రం సమర్పించారు.కంపెనీలు ఏకపక్షంగా పెంచుతున్న ఆక్వా ఫీడ్ ధరలను తక్షణమే అడ్డుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఫార్మ్‌గేట్ వద్ద రొయ్యల ధరలకు స్థిరత్వం కల్పించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జీవో నెం. 57 ప్రకారం అర్హులైన ఆక్వా రైతులకు పూర్తిస్థాయిలో విద్యుత్ సబ్సిడీని అమలు చేయాలని, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ (NCEL) ద్వారా రైతుల నుంచి నేరుగా రొయ్యల కొనుగోలు ప్రక్రియ చేపట్టేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కనుమూరి భాస్కరరాజు, అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, ఉపాధ్యక్షులు ఏడార యశ్వంత్ కుమార్, కార్యదర్శి చావటపల్లి నాగభూషణం, సంయుక్త కార్యదర్శి ఎం. శ్రీహరి వర్మ, కోశాధికారి డి. మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.