వినాయక విగ్రహ ప్రతిష్టకు అనుమతి తప్పనిసరి:- ఎస్ ఐ మల్లికార్జున్ రెడ్డి
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవాళ్ళు తప్పనిసరిగా పోలీసు వారి అనుమతి పొందాలి. కడప జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో డీజేలు మరియు ఆర్కెస్ట్రాలు నిషేధం.నందలూరు మండల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పండుగను జరుపుకోవాలని నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి తెలిపారు.