సంగారెడ్డి జిల్లా నుండి ఎంపీగా బరిలోకి దిగుతున్న చిట్టెంపల్లి బాలరాజ్

September 9, 2026 | వైరల్ వార్తలు

ఏ పార్టీ టికెటు ఇచ్చిన కానీ ఎంపీగా పోటీ చేయడానికి రెడీగా ఉన్నాను

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం సెప్టెంబర్ 9. 09. 2026ప్రజలు గెలిపిస్తే ఉచిత విద్యుత్.. రైతులకు ఎడ్లు, ఆవులు.. భూమిలేని వారికి ఎకరా భూమి: చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి ఎంపీగా బరిలోకి దిగుతానని సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సవాల్ విసిరారు. ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.తనను ప్రజలు ఎంపీగా గెలిపిస్తే సంగారెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తానని బాలరాజ్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, భూమిలేని నిరుపేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు.తనను ఎంపీగా గెలిపించిన ప్రజలందరికీ కరెంటు ఉచితంగా అందించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు రెండు ఎడ్లు, ఒక బండి అందించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రెండు ఆవులు అందిస్తానని ప్రకటించారు.అదేవిధంగా భూమిలేని పేద కుటుంబాలకు ఒక ఎకరా భూమి అందించేలా పోరాటం చేస్తానని చిట్టెంపల్లి బాలరాజ్ హామీ ఇచ్చారు. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తానన్నారు.ప్రజా సమస్యలను పార్లమెంట్‌లో బలంగా వినిపించడంతో పాటు సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తానని బాలరాజ్ తెలిపారు. ప్రజలు తనకు అవకాశం ఇస్తే ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని అన్నారు.ఏ పార్టీ టికెట్ ఇచ్చినా పోటీకి సిద్ధం.. ప్రజల ఆశీర్వాదమే నా బలం అని చిట్టెంపల్లి బాలరాజ్ పేర్కొన్నారు. సంగారెడ్డి ఎంపీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రజల సమస్యల పరిష్కారానికి అంకితం చేస్తానని ఆయన స్పష్టం చేశారు

🌐 Select Language:
📰 ePaper