బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ అప్రజాస్వామికం: వై. నరోత్తం
జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం సెప్టెంబర్ 9. 09. 2026 జహీరాబాద్: అసెంబ్లీ అంటే అధికార పార్టీకి మాత్రమే చెందిన వేదిక కాదు.. ప్రజల సమస్యలను చర్చించే ప్రజాస్వామ్యానికి పవిత్రమైన దేవాలయం.ప్రజలు ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంటే, వారి సమస్యలను చర్చించకుండా సస్పెండ్ చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయం అని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ వై. నరోత్తం అన్నారు.ప్రజల గొంతుకగా నిలిచిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం అంటే ప్రజల గొంతును అణచివేయడమే. ప్రతిపక్షాన్ని భయపెట్టడం, ప్రశ్నించే గొంతులను మూయించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదు.రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగులు, పేదల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగాలి. ప్రజల సమస్యలను వినకుండా సస్పెన్షన్లు విధించడం కాదు.. వాటికి పరిష్కారాలు చూపించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్లను వెంటనే ఉపసంహరించాలి. ప్రజా సమస్యలపై చర్చకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి.ప్రజల గొంతును అణచలేరు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేరు!