జనం న్యూస్ 19 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు మున్సిపల్ కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ మండల మహాసభను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు కందుల మధు అధ్యక్షతన 26న ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను మరియు యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభను జయప్రదం చేయుట కొరకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనీ జయప్రదం చేయాలని శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన విమర్శించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థల్లో సమస్యలు విలయ తాండవం చేస్తుంటే ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేట్ విద్యా రంగాన్ని ప్రోత్సహిస్తుందని విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని సంక్షేమ వసతి గృహాల్లో కనీస వసతులు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు గురవుతున్న ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తక్షణమే సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని తక్షణమే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను మొత్తం ఒకేసారి విడుదల చేయాలని లేనిపక్షంలో మంత్రుల క్యాంప్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు పాల్గొన్న వారు ఉదయ్ చరణ్, చండీశ్వర్ సోమనాథ్, దినేష్, సాయికిరణ్ వెంకట్ సూర్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.