

జనం న్యూస్ జనవరి 11 కాట్రేనికోన( గ్రంధి నానాజీ)
అమలాపురం సమీపంలో చెయ్యురు నందు గల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్
కళాశాలలో ముందస్తు సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ సంక్రాంతి సంబరాల్ని ‘డైరక్టరీ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ (డప్), జై ఎన్ టి యు కె చెందిన డా॥ బి. బాల కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తు తెలుగుదనం ఉట్టుపడేలా సంస్కృతి , సాంప్రదయాల మేళవింపుతో జరుపుకునేది సంక్రాంతి పండగని ప్రస్తుతం ఆధునిక సమాజంలో ఇటు వంటి ఉత్సవాలు యువతలో ఆశక్తి ఉత్తేజాన్ని పెంచుతున్నాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా|| మ్. శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడన్నీ సంక్రాంతి అంటారని, ఈ పండగ ముఖ్య ఉద్దేశం చెడుపై మంచి, నిరాశపై ఆశను, చీకటి పై కాంతి విజయమును సూచిస్తుందని ఆధునిక సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో నేటి విద్యార్థులుకు ఇటు వంటి సాంద్రదాయాలు అజ్ఞానాంధకారాన్ని తొలిగించి జ్ఞాన కాంతులు వెదజల్లే దిక్సూచివంటివని ఉద్భోదించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో విద్యార్థినులు ముగ్గులు వేసి, గొబ్బిమ్మలు పెట్టి, భోగి మంటలు చుట్టు తిరిగి సంక్రాంతి లక్ష్మి పాటలు పాడారు. జ్ఞాన కాంతులు వెదజల్లే భోగి మంటలు, హరిదాసు సంకీర్తనలు, తెలుగింటి ఆడపడుచుల పిండి వంటలు, రంగవల్లులు, గేమ్స్ స్టాల్స్, డూడూ బసవన్నలు (గంగిరెద్దులు), సంక్రాంతి లక్ష్మి పాటలతో కళాశాలలో ముందస్తు సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ ఆట పోటీలలో విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు జై ఎన్ టి యు కె కు చెందిన డైరక్టర్ ఆఫ్ ప్లానింగ్ & అకడమిక్స్ విభాగాధిపతి డా॥ బ్. బాలకృష్ణ బహుమతులు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ ద్వసన్ వర్మ, కళాశాల ప్రిన్స్ పాల్, డా|| మ్. శ్రీనివాస కుమార్, కళాశాల పాలకవర్గ సభ్యులు శ్రీ సందీప్ లు, కళాశాల విద్యాశాఖాధికారిణి ॥ స్. జయలక్ష్మి, వివిధ విభాగాల అదిపతులు, అధ్యాప కులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.