

నిద్రమత్తులో జిహెచ్ఎంసి పాలకవర్గం స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలు జనం న్యూస్ మార్చి 4 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు జిహెచ్ఎంసి పట్టణ పరిధిలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కన్నెత్తి చూడడం లేదు. పటాన్ చేరు జిహెచ్ఎంసి పరిధిలో టౌన్ ప్లానర్ అధికారులు ఉన్నప్పటికీ ఆఫీసుల కుర్చీలకే పరిమితం కావడంతో అక్రమార్కులు అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.పటాన్ చేరు లోని సీతారామ కాలని, నందన్ రతన్ ప్రైడ్ , సాయిరాం కాలనీ లోఎటు చూసినా అక్రమ నిర్మాణాలు పదుల సంఖ్యలో నిర్మాణాలు వెనుక పలు రాజకీయ నాయకులు చల్లని చూపులతో యదేచ్చగా నిర్మాణాలు చేపడుతున్నారు. జిహెచ్ఎంసి అధికారుల ఉదాసీన వైఖరి వల్ల అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని విమర్శలువెలువెత్తుతున్నాయి సీతారాంపురం లో అక్రమ కట్టడాల వెనుక స్థానిక కార్పొరేటర్ మేట్టు కుమార్ పేరుని అడ్డం పెట్టుకొని నాలుగు అంతస్తులను నిర్మిస్తున్నరని జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారిమధు మంగళవారం ఉదయం వివరణ ఇచ్చారు.దాని వల్ల ఆ అక్రమ కట్టడాల అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆయన అన్నారు.అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసి జిహెచ్ఎంసి ఆదాయాన్ని పెంచాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా జిహెచ్ఎంసి లో ప్రభుత్వం కొత్తగా టిపిఓ లను నియమించింది.వీరు జిహెచ్ఎంసి పరిధి లో జరుగుతున్న అనుమతి లేని నిర్మాణాలను గుర్తించి టౌన్ ప్లానింగ్ అధికారులకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. వారి నివేదిక ఆధారంగా అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. కానీ చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలు చేపట్టే వారి దగ్గర తగిన మూల్యాని పుచ్చుకొని అక్రమ నిర్మాణాలు చేపడుతున్న చూసి .చూడనట్లుగా వ్యవహరించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. అక్రమ నిర్మాణదారులకు ప్రాధాన్యం ఇస్తూ సదరు సిబ్బంది చెప్పిందే వేదం అన్నట్లు సాగుతుండడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టపడటం లేదంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఈ అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి అధికారులు, జోనల్ అధికారులు స్పందించి ఈ అక్రమ నిర్మాణాలకు చేయూతనిస్తున్న టి పి ఓ మధు పట్ల తగు చర్యలు తీసుకోగలరనీ ప్రజలు కోరుతున్నారు. జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ ని వివరణ కోరగా అక్రమ నిర్మాణదారులకు నోటీసులు పంపుతామని చెప్పి అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్య నేర్చుకోలేదు. ఇప్పటికైనా సంబంధిత జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమ కట్టడాలపై నోటీసులు జారీ చేసి తగు చర్య తీసుకోగలరు అని ప్రజలు మండిపడుతున్నారు.


