Listen to this article

జనం న్యూస్ జనవరి 11 కాట్రేనికోన( గ్రంధి నానాజీ)
కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి విశేష కృషి చేస్తుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. ముమ్మిడివరం మండలం చిన్న కొత్తలంక, అయినాపురం గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్లను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. వైసిపి ఐదేళ్ల హయాoలో అస్తవ్యస్తం చేసిన పాలనను గత ఆరు నెలలుగా గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చిన్న కొత్తలంకలో 10.04 లక్షలు విలువతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, రెండు గోకులం షెడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే అయినాపురంలోని సాలిపేట బొర్రా గట్టు మోకావారిపేట వీధుల చెరువులలో30.06 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే బుచ్చిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలా గంగాభవాని ఎంపీడీవో తాడి శ్రీ వెంకటాచార్య పంచాయతీ రాజ్ డిఈఈ పి విజయ శ్రీనివాస్ ఈఓపిఆర్డి సిహెచ్ లక్ష్మీ కళ్యాణి చిన్న కొత్తలంక సర్పంచ్ పొత్తూరి ఉమారాణి సర్పంచ్ మోకా రామారావు గుత్తుల సాయి చెల్లిఅశోక్ గొల్లకోటి దొరబాబు తాడి నరసింహారావు గుద్దటి జమ్మి పి రవి వర్మ పి నాగరాజు వర్మ పెద్దిరెడ్డి సత్య గోపాలకృష్ణ ఇందుకూరి పాండురంగరాజు పివివి సత్యనారాయణ రాజు అద్దాని శ్రీనివాసరావు గొల్ల కోటి ఫణి చిక్కాల అంజిబాబు దొమ్మేటి రమణ కుమార్ ఏపీఓ డి వెంకటేశ్వరరావు తో పాటు పలువురు పాల్గొన్నారు.