

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి, పాడి పరిశ్రమకు మరింత చేయూతనివ్వడంపై రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో శనివారం సుమారు 60 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి మంజూరైన 12 లక్షల రూపాయలతో నిర్మించిన 5 మినీ గోకులం షెడ్లు, 10 లక్షల రూపాయలతో ఐటీసీ సంస్థ మరియు గ్రామ పెద్దల సహకారంతో మెయిన్ పాఠశాలలో నిర్మించిన విద్యార్థుల భోజనశాల భవనమును ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ పెద్దఎత్తున నిధుల కేటాయిస్తోందని, గత ప్రభుత్వం పంచాయతీలను నిర్వీర్యంచేసి సర్పంచ్‌లను భిక్షాటన చేసేలా చేస్తే నేటి ఎన్డీఏ ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి నిచ్చిందన్నారు. గ్రామాల ప్రగతే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాలను ప్రగతిబాటలో నడిపేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు నారా లోకేష్ సహకారంతో నియోజకవర్గానికి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేయాలన్న సంకల్పంతోనే పనిచేస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం స్థానిక చంద్రిక రైస్ మిల్లు, లక్ష్మీ గణపతి రైస్ మిల్లు యాజమాన్యం సహకారంతో 200 కేజీలు బియ్యాన్ని రాయవరం గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉండవిల్లి రాంబాబు, గ్రామశాఖ అధ్యక్షుడు వెలుగుబంట్ల గోపికృష్ణ, నల్లమిల్లి రాజేష్ రెడ్డి, పర్వతిని మణిదీప్, టేకుమూడి గణేష్, మల్లిపాల గోవిందు, తాడి రామచంద్రారెడ్డి, వల్లూరి శ్రీను, చల్లా సత్యనారాయణ, కామన సురేష్, దేవిశెట్టి కోటేశ్వరరావు(చిన్ని), దేవిశెట్టి కరుణకుమార్, ఎంపీపీ నౌడు వెంకటరమణ, సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, బేరా దుర్గాప్రసాద్, పేకేటి కోటేశ్వరరావు, కర్రీ దుర్గాప్రసాద్, నేతల సురేష్, నూలు వీర వెంకట సత్యనారాయణ, ఇండుగుమిల్లి అరుణ కుమార్, కేతా శ్రీను, లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి రాంబాబు, నదురుబాధ ఎంపీటీసీ ఉండవల్లి సుబ్బారాయుడు, లొల్ల ఎంపీటీసీ వైట్ల సతీష్, వెదురుపాక టిడిపి నాయకులు కొవ్వూరి చంటిరెడ్డి,వడ్డాది వెంకట కృష్ణంరాజు, కొవ్వూరి నాగిరెడ్డి,సతీష్ శ్రీనివాస్ రెడ్డి, కటారి రామకృష్ణ, వి.సావరం తెదేపా నాయకులు, కోనసీమ జిల్లా బీసీ సెల్ ఉపాధ్యక్షులు పిల్లి గణేష్, కూరకాళ్ళపల్లి గ్రామ తెదేపా బిసి నాయకులు కాదా ప్రభాకర్ రావు, చెల్లూరు గ్రామ మాజీ వైస్ ఎంపీపీ దేవు శ్రీను, రాయవరం మండలం లోని ఆయా గ్రామాల కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎంపీడీవో ఎం కీర్తి స్పందన, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏపీవో జే సుధారాణి, పంచాయతీ కార్యదర్శి ఎన్ ధనలక్ష్మి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, ఎంజిఎన్ఆర్ జిఎస్ సిబ్బంది, గ్రామపంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.