Listen to this article

సొమ్ము రికవరీ చేసే వరకు ఉపేక్షించేది లేదు:- ఏపీఎం బిరవెల్లి రాంబాబు ( జనం న్యూస్)మార్చి 6 కల్లూరు మండల రిపోర్టర్ :- మండలంలో స్త్రీనిధి రుణాలు గోల్ మాల్ య్యాయని,సెర్ప్ లో పనిచేస్తున్న కొంతమంది అధికారులు డ్వాక్రా సభ్యుల నుంచి స్త్రీనిధి రుణాలు రికవరీ చేసినప్పటికీ జమ చేయకపోవడంతో ప్రశ్నించినందుకు కావాలనే నిందారోపణ చేస్తున్నారని బుధవారం స్త్రీ శక్తి భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏపిఎం బీరవల్లి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 31 గ్రామపంచాయతీలకు 7 క్లస్టర్లు ఉన్నాయని 46 మంది గ్రామ దీపికలు పనిచేస్తున్నారని తెలిపారు.1693 డ్వాక్రా గ్రూపులు ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల 900 గ్రూపులు మాత్రమే కొనసాగుతున్నాయని తెలిపారు. ఉన్న గ్రూపులలో స్త్రీ నిధి రుణాలు రికవరీ సక్రమంగా కాకపోవడంతో అనుమానం వచ్చి ఒక కస్టర్ ని ఆడిట్ చేయించడం జరిగిందని తెలిపారు. ఆడిట్ లో సుమారు 54 లక్షల రూపాయలు గోల్ మాల్ జరిగినట్లు నిర్ధారించడం జరిగిందని అన్నారు. అందులో కొంతమంది ఉద్యోగులు తప్పు చేసినట్లు ఒప్పుకొని రికవరీ చేస్తామని లిఖితపూర్వకంగా రాసి ఇచ్చినట్లు తెలిపారు.ఈ క్రమంలో శ్రీనిధి రుణాలు రికవరీ చేయడం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి నిధులు రికవరీ చేయాలని ఆదేశించడంతో సొమ్ము రికవరీ చేయాల్సి వస్తుందని అవినీతికి పాల్పడిన కొంతమంది ఉద్యోగులు కావాలనే దురుద్దేశంతో వారితో అసభ్యంగా మాట్లాడానని నిందలు వేస్తున్నారని అన్నారు. కానీ వారు ఆరోపిస్తున్న ఆరోపణలో ఎటువంటి వాస్తవం లేదని కేవలం విధి నిర్వహణ గురించి మాత్రమే మాట్లాడటం జరిగిందని తెలిపారు. పనితీరు సక్రమంగా లేని 15 మందికి మెమో జారీ చేయడంతో సమస్యని మరింత ఉధృతం చేస్తూ అస్సలు విషయాన్ని పక్కత్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. మండలంలో స్త్రీనిధి రుణాలు అవకతకలు జరిగినట్లు రికార్డు పరమైన ఆధారాలు ఉన్నట్టు తెలిపారు. ముందస్తుగానే మండలంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఏ పంచాయతీలో ఎంత అవినీతి జరిగిందో లెక్కలతో సహా జిల్లా కలెక్టర్ , ప్రాజెక్టు డైరెక్టర్ కి అందజేయనున్నట్టు తెలిపారు. ఎవరు ఎన్ని నిందలు వేసిన ఉన్నత అధికారుల సహకారంతో నిధులు రికవరీ చేపిస్తామని అన్నారు. అయితే ఇంత అవినీతి జరుగుతుంటే గత పది సంవత్సరాల నుండి సెర్ప్ అధికారులు ఎందుకు స్పందించలేదని మండలంలో చర్చినీయంగా మారింది. అవినీతికి పాల్పడిన వారికి కొమ్ముకాశారా..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. స్త్రీనిధి రుణాల అవకతవకల్లో ఎవరి ప్రమేయం ఎంతుందనేది తెలియాలంటే మండలంలో అన్ని క్లస్టర్లను నిష్పక్షపాతంగా ఆడిట్ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా ఆడిట్ జరిగితే కోట్ల రూపాయలు స్త్రీనిధిలో జమ అవుతాయని అంటున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ పిడి దృష్టి సారించి స్త్రీనిధి రుణాలు రికవరీ చేయించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. వాస్తవాలను వెలికి తీసే క్రమంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..