Listen to this article

ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ మార్చి 5 పి ఆర్ టి యు టీఎస్ తరపున శాసనమండలి సభ్యునికి గా బరిలో నిలిచి ఎన్నికలో ప్రత్యర్థులని మట్టి కరిపించి భారీ విజయాన్ని సొంతంచేసుకొన్న రాష్ట్ర మాజీ అధ్యక్షులు పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయోత్సవ వేడుకలు ఏన్కూర్ మండలం లో ఘనంగా నిర్వహించారు. పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేటెడ్ అధ్యక్షులు కే సైదయ్య తెలిపారు. ఏన్కూర్ పాఠశాల, జడ్.పి.హెచ్.ఎస్ బాలికల కే జీ వి బి పాఠశాల లలో స్వీట్స్ పంపిణీ చేసి స౦తోషాన్ని అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు మండల అధ్యక్షులు చింతా రాజు, కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు ,జిల్లా కార్యదర్శి అబ్దుల్ మజీద్, ,ప్రేమానందం , రాంబాబు, నరసింహారావు సులోచన కృష్ణవేణి పాల్గొన్నారు.