Listen to this article

జనం న్యూస్ మార్చి 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం రోజునా బీజేపీ కార్యకర్తలు మొన్న జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీలలో బిజెపి అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సందర్భంగా తెలంగాణ తల్లి స్థూపం వద్దబాణాసంచాకలుస్తూ విజయోత్సవాలు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ టీచర్స్ ఎమ్మెల్సీ మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీ విజయానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నా
అలాగే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి లోకల్ ఎలక్షన్స్ లో కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయని ఆయన మాట్లాడారు. ఇట్టి కార్యక్రమంలోజక్కనివంశీ,ఘనశ్యామ్ గంగేశ్వర్, రంజిత్, శ్రీకాంత్, కురాకుల భూమేష్, కూరాకుల శ్రీను, గుండా విట్టల్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు