

జనం న్యూస్ కాట్రేనికోన మార్చి 5 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన పంచాయతీ పరిధిలో గత వారం రోజులు నుండి పారిశుధ్య పనులు ముమ్మరం గా జరుగుతున్నాయి. డ్రైన్ లలో పూడిక, చెత్త చెదారం తొలగిస్తున్నారు. మెయిన్ రోడ్డు బ్రాహ్మణ చెరువు, హై స్కూల్ రోడ్డు, బి ఎస్ ఎన్ ఎల్ రోడ్డు ప్రాంతల్లో పనులు చేస్తున్నారు. బుధవారం సర్పంచ్ గంటి సుధాకర్ ఈ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు కార్యక్రమం లో వార్డు మెంబెర్ కిషోర్, పంచాయతీ సిబ్బంది ఎం సత్యనారాయణ,, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు