

జనం న్యూస్ మార్చ్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండల కేంద్రం లోని జేత్వన్ బుద్దవిహార్ నిర్వహిస్తున్న శ్రామినేర్ శిబిరంలో టీయుడబ్ల్య్జ జే ఏ ఆసిఫాబాద్ శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ సందర్శించరు వారు ఈ సందర్బంగా శ్రామినేర్లతో బుద్దుడి శాంతి మార్గాన్ని , అంబేద్కర్ క్రాంతి మార్గాన్ని ప్రజల్లోకి వెళ్ళినప్పుడే జ్ఞానవంత సమాజం ఏర్పడుతుందని ప్రపంచ శాంతి మార్గం తోనుషులంత సమానమని బుద్దుడు ప్రబోధిస్తే,భారత రాజ్యాంగ ద్వారా అంబేద్కర్ దేశ ప్రజలకు సుఖమయ జీవితాన్ని అందించారని పేర్కొన్నారు. నాగపూర్ పట్టణానికి చెందిన భారతీయ బౌద్ధ బిక్కు సంఘా భీక్షు బౌద్ద గురు భాదంతే బంతే ధమ్మ సారధి నేతృత్వంలో కొనసాగుతున్న శ్రామినేర్ శిబిరంలో వారం రోజులపాటు బుద్ధుడు నాటి సమాజానికి చూపిన శాంతి మార్గం,జీవన శైలి నేటి సమాజానికి కూడా అందచేయవలన అవసరం ఎంతైనా ఉందని,అదేవిధంగా అంబేద్కర్ భారత రాజ్యాంగ ద్వారా అందించిన స్ఫూర్తిని ప్రజల్లో చైతన్యం కల్పించాలని కోరారు.అంతకు ముందు భారతీయ బిక్కు సంఘ్ ప్రధాన కార్యదర్శి ధమ్మ సారధి,భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కార్,దీక్షలో కూర్చున్న శ్రామినెర్లకు దిశ నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో భంతే రాహుల్ బోధి (నాగపూర్), భoతే నిన్నాన్ (మహారాష్ర్ట), ఎస్ ఎస్ డి జిల్లా ఇన్చార్జి,శ్రామినేర్ ధమ్మ దీప్ ,బౌద్ద మహా సభ మండల అధ్యక్షులు జయరాం,అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి దుర్గం సునీల్ కుమార్,ఉపాధ్యక్షులు దుర్గం హంస రాజ్,సమాజ అధ్యక్షులు మహాత్మా రాజేంద్ర ప్రసాద్, నాయకులు రోషన్,అరుణ్, తదితరులు పాల్గొన్నారు.