

జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ
జనతా పార్టీ రెండు స్థానాల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా మండల కేంద్రం లోని బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ మండల అధ్యక్షులు బండారు వీరబాబు ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్బంగా వీరబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పై ప్రజలకు విరక్తి వచ్చిందని, రాబోయే రోజులలో బీజేపీ తెలంగాణ లో అధికారం లోకి రావడం తథ్యమన్నారు. ఈ కార్యక్రమం లో మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు పాపయ్య,రామకృష్ణ, మండల కార్యదర్శి గురవయ్య, మండల నాయకులు బిక్షం రెడ్డి,బూత్ అధ్యక్షులు,వినోద్, మహేష్, గోపిరెడ్డి,గురుస్వామి,గోపాలకృష్ణ,పోలంపల్లి శ్రీధర్, తాళ్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.