

జనం న్యూస్ మార్చి 6 నడిగూడెం నడిగూడెం మండలం లోని బృందావనపురం గ్రామంలో ఉపాధి పనులను జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు గురువారం పరిశీలించారు. బృందావనపురం నుండి కలకోవ గ్రామానికి వెళ్లే లింకు రోడ్డు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కూలీల హాజరు వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేణుగోపాలపురం గ్రామంలో నిర్వహిస్తున్న నర్సరీని పరిశీలించారు.నిర్దేశించిన లక్ష్యాల మేరకు ప్రతి నర్సరీలో మొక్కలు పెంచాలని, మొక్కల పెంపకం పై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు.వారి వెంట ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీడీవో సంజీవయ్య, ఎంపీఓ విజయ్ కుమారి, ఈసీ శ్రీను, టిఏ సురేష్, ఉపాధి సిబ్బంది యన్.విజయ్ కార్యదర్శి నారాయణరెడ్డి, విజయలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్ లు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.