Listen to this article

జనం న్యూస్ మార్చి 7 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మూసాపేట వై జంక్షన్ వద్ద గల అభినందన్ గ్రాండ్ హోటల్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.సంస్థ అధ్యక్షురాలు అరుణ ను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఆకాశం సగం అవకాశాల్లో సగం ఇవ్వమనే స్థాయి నుంచి ఆకాశమే హద్దుగా ఎదిగిన మహిళ తీరు అద్భుతమని కొనియాడారు.అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవికి సైతం పోటీ పడే స్థాయికి మహిళ ఎదగడం గొప్ప విషయం అన్నారు ఈ కార్యక్రమంలో ఏబీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, తూము వేణు, మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, మరియు ఏఎంసీ చైర్మన్ పుష్ప రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.