Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 7 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట మండల గ్రామ పంచాయతీ కార్మికులు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ధర్నా చేయడం జరిగింది. గ్రామపంచాయతీ కార్మికులు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతూ…గత నాలుగు నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయని కుటుంబాన్ని పోషించలేక అప్పుల బాధలు ఉన్నామని గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని మొండి వైఖరిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని 60జీవో ప్రకారం 16 వేల వేతనం ఇవ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా జనవరి నెల నుండి నేరుగా కార్మికుడి అకౌంట్లో డబ్బులు వేస్తామని డిసెంబర్ నెలలో హామీ హామీ ఇవ్వడం జరిగిందన్నారు . ఇప్పటికీ మూడు నెలలు గడుస్తున్న కార్మికులకు వేతనాలు అందడం లేదు ఒక్కొక్క గ్రామపంచాయతీలో రెండు మూడు నెలల నుండి వేతనాలు అందడం లేదు, అని కార్మికులకి కనీస భద్రత పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు ప్రతి కార్మికుడికి 15 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కార్మికుడికి కనీస వేతనం 24000 ఇవ్వాలని కార్మికుడు రిటైర్మెంట్ తరువాత ఐదు లక్షల నెక్స్ట్ గ్రేషియా ఇవ్వాలని కార్మికుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులు పలుసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు.అయినా ప్రభుత్వం ఇప్పటికీ కార్మికుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలలో గ్రామపంచాయతీ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించి వేతనాల కోసమై చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి కార్మికులు డిమాండ్ చేశారు. లేనట్లయితే కార్మికులు మరో పోరాటడానికి సిద్ధమవుతారని తెలియజేశారు. ఇ కార్యక్రమం లో
అధ్యక్షుడు ఎండిగా రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి లద్దు నూరి కుమార్, జనరల్ సెక్రెటరీ మేక మల్ల రాము, సంపత్ వాసాల సారయ్య, సంజీవ్ రవి, రాజ కొమురయ్య, రాజు,తిరుపతి, మైపాల్ రెడ్డి, ఉమా, వనిత, అలీమా, స్వప్న,రాజమణి, తదితరులు పాల్గొన్నారు.