Listen to this article

జనం న్యూస్,పార్వతీపురం మన్యం జిల్లా, మార్చి 7,( రిపోర్టర్ ప్రభాకర్):విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాం ప్రసాద్ అన్నారు. మండలంలోని రావాడ రామ భద్రా పురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ లో పదో తరగతి కీలక మలుపుతిప్పనుందన్నారు. పరీక్షల్లో ఉత్తిర్ణ సాధించాలన్న తపనతో పాఠ్యాంశాలను అవలోకనం చేసుకోవాలని సూచించారు. కఠోర దీక్షతో కలలుగన్న లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని అన్నారు.  ప్రత్యేక తరగతుల నిర్వహణలో   పాఠ్యాంశాల్లో ని అనుమానాలను ఉపాధ్యాయుల వద్ద నివృత్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. అక్కడ నుంచి కురుపాం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అందిస్తున్న రెవెన్యూ సేవలపై ఆరా తీశారు. పి జి ఆర్ ఎస్, పి వో ఎల్ ఆర్, ఎమ్ ఎస్ ఎన్ ఈ సర్వే, మ్యుటేషన్ ల పరిష్కారం, పి – 4 సర్వే నిర్వహణ తీరు అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్ ఎస్ ఎమ్ ఈ సర్వే త్వరితగతిన పూర్తి చేసినందుకు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ ఎమ్.రమణమ్మ, ఎమ్ పి డి ఓ ఉమా మహేశ్వరీ, ఆశ్రమపాఠశాలప్రధానోపాధ్యాయుడు డి.శ్రీనివాస రావు , తదితరులు, పాల్గొన్నారు.