

జుక్కల్ మార్చి 7 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని శుక్రవారం నాడు దోస్పల్లి గ్రామం తెలంగాణ ఉప పీఠంలో జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు జగద్గురు శ్రీ నరేందర్ మహారాజు దర్శనము చేసుకొని వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్యే వెంట జుక్కల్ మాజీ సర్పంచ్ రాములు సెట్ . మాజీ సొసైటీ చైర్మన్ రాజు పటేల్ . మద్నూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చెవుల అవార్ హనుమాన్లు , దిలీప్ పటేల్, రాచూర్ రాజు పటేల్, జుక్కల్ నరేష్ సెట్, మరియు నరేందర్ మహారాజ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

