Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మార్చి 7 రిపోర్టర్ సలికినిడి నాగరాజు చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన వైసీపీమంత్రి అవినీతిపై సొంత పార్టీ వారే కోర్టులను ఆశ్రయించారు ప్రత్తిపాటి. సెంటు పట్టాలు.ఇళ్ల కేటాయింపు సహా అన్నిమార్గాల్లో అవినీతికి పాల్పడిన చరిత్ర సదరు మంత్రిది పుల్లారావు టీడీపీప్రభుత్వం ఎలక్ట్రానిక్ పద్ధతిలో డ్రా తీసి పేదలకు ఇళ్లు కేటాయిస్తే.వైసీపీప్రభుత్వం వాటిపై కూడా డబ్బులు వసూలుచేసింది పుల్లారావు. రాష్ట్రంలోని టిడ్కో ఇళ్ల సముదాయంలో మౌలికవసతులు కల్పించి, తక్షణమే పేదలు నివాసముండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి పుల్లారావు. పేదలందరికీ ఇళ్లు, సెంటు పట్టాల పంపిణీతో నివాసయోగ్యానికి వీలుకాని భూముల్ని, కొండలు. గుట్టలు. వాగులు.. కుంటల పక్కన 33లక్షల ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో వైసీపీ ప్రభుత్వం రూ.7,800కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. పేదల సొంతింటి కల సాకారం చేసే సదుద్దేశానికి విరుద్ధంగా జగన్ సర్కార్ వ్యవహరించిందని, కేంద్రప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులకు సమానంగా రాష్ట్ర వాటా ఇవ్వకుండా మొక్కుబడిగా ఇళ్ల నిర్మాణం పేరుతో జగన్ ప్రభుత్వం ప్రజల్ని వంచించిందని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం.. సెంటు పట్టాల పంపిణీ అంశంపై శుక్రవారం ఆయన సభలో మాట్లాడారు. చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన అవినీతి మంత్రిపై సొంతపార్టీ వారే కోర్టుకు వెళ్లారు.పేదల ఉసురు తగిలే వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. పనికిరాని భూముల్ని పేదలకు ఇళ్ల పట్టాలుగా ఇవ్వడమేగాక, భూమిచదును పేరుతో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చరిత్ర వైసీపీప్రభుత్వానిదేనని పుల్లారావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లనిర్మాణంపై దృష్టిసారించిందన్నారు. ఆ క్రమంలో రూ.643కోట్లు ఖర్చుచేసి, దాదాపు లక్షా14వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిందన్నారు. గతంలో టీడీపీప్రభుత్వ హాయాంలో 95శాతం వరకు పూర్తైన టిడ్కోఇళ్ల నిర్మాణాన్ని కూడా వైసీపీప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. మిగిలిన 5 శాతం పనులు కూడా చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా 3.12లక్షల పేద కుటుంబాలను రోడ్లపాలు చేసిందన్నారు. పేదల ఉసురు తగిలే వైసీపీ 11 సీట్లకు పరిమితమైందనేది కాదనలేని వాస్తవమని పుల్లారావు స్పష్టంచేశారు. వైసీపీప్రభుత్వంలో చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహిచింన అవినీతి మంత్రిపై సొంతపార్టీవారే కోర్టును ఆశ్రయించారని, ఇళ్ల కేటాయింపు సహా, అన్నిరకాలుగా అన్నిమార్గాల్లో అవినీతికి పాల్పడిన చరిత్ర సదరు మంత్రిదని పుల్లారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా జరగనంత అవినీతి గత ప్రభుత్వంలో తన నియోజకవర్గంలోనే జరగడం బాధాకరమని ప్రత్తిపాటి తెలిపారు. టీడీపీప్రభుత్వం ఎలక్ట్రానిక్ పద్ధతిలో డ్రా తీసి పేదలకు ఇళ్లు కేటాయిస్తే.వైసీపీప్రభుత్వం వాటిపై కూడా డబ్బులు వసూలుచేసింది.. టీడీపీప్రభుత్వంలో ఇళ్లకేటాయింపులో ఎక్కడా రాజకీయ జోక్యానికి తావులేకుండా, వేలెత్తి చూపడానికి వీల్లేకుండా ఎలక్ట్రానిక్ పద్ధతిలో డ్రా తీసి పేదలకు ఇళ్లు కేటాయించడం జరిగిందన్నారు. ఆ విధంగా కేటాయించిన ఇళ్ల నంబర్లను కూడా మార్చేసి మరీ వైసీపీప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.50వేల నుంచి లక్ష వరకు వసూలు చేసిందని పుల్లారావు తెలిపారు. ఈ సమస్యలపై కూటమిప్రభుత్వం వెంటనే దృష్టి సారించి పేదలకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మాజీమంత్రి సభ సాక్షిగా డిమాండ్ చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో మొత్తం 5,520 కి గాను, 4,512 టిడ్కో ఇళ్లు పూర్తయ్యాయని, వాటిని ఆనాడు మంత్రి నారాయణ స్వయంగా పరిశీలించడం కూడా జరిగిందన్నారు.నిరుపయోగంగా ఉన్న టిడ్కో ఇళ్లను తక్షణమే నివాసముండటానికి ఇష్టపడే పేదవారికి కేటాయించాలి.ప్రస్తుతం రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న టిడ్కో ఇళ్లలో నివసించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారికి వెంటనే కేటాయించినట్టైతే, అన్ని ఇళ్లలో దీపాలు వెలుగుతాయన్నారు. నిరుపయోగంగా ఉంచేబదులు తక్షణం ఇళ్లలోకి పేదలు చేరే మార్గంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. టిడ్కో గృహ సముదాయంలో దుకాణాల నిర్మాణం.. పార్కుల ఏర్పాటు వంటివి త్వరితగతిన పూర్తిచేసి పేదలు గృహ ప్రవేశం చేసేలా చేస్తే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని పుల్లారావు సూచించారు. అద్దెలకు ఉంటూ ఇబ్బంది పడే పేదలు టిడ్కో ఇళ్లలో నివాసం ఉండటానికి ఆసక్తిగానే ఉన్నారని ఆయన చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో ఈ దిశగా ఆలోచన చేసి టిడ్కో ఇళ్లలో నివాసం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలా ఉండే వారికి సంవత్సరం తర్వాత ఇళ్లపై పూర్తి హక్కులు కల్పిస్తే బాగుంటుందని పుల్లారావు అభిప్రాయపడ్డారు. బ్యాంకులు కూడా అసంపూర్తిగా ఉన్న టిడ్కో ఇళ్ల రుణాలకు సంబంధించి మారటోరియం ఇవ్వడం వల్ల లబ్ధిదారులకు కొంత వెసులుబాటు ఇచ్చినట్టవుతుందన్నారు. ఇలా చేస్తే పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే కూటమిప్రభుత్వ లక్ష్యం, చంద్రబాబు కల సాకారమవుతాయని మాజీమంత్రి సూచించారు.