

జనం న్యూస్ మార్చి 07:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలో నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవ కార్యక్రమాలనుఘనంగా నిర్వహించుకున్నారు. ముందుగా అంతర్జాతీయంగా పేరు పొందిన మహిళా మణుల యొక్క చిత్రపటాలను చూపించి వారి గొప్పతనాన్ని క్లుప్తంగా విన్నవించారు.ఈ సందర్భంగా పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ ఇంటికి కంటికి రెప్పలాగా నిరంతరం కుటుంబాన్ని కాపాడుతూ కుటుంబ శ్రేయస్సు కోసం అహర్నిశలు తపన పడుతూ, అందరి ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటున్న మహిళలు చాలా గొప్ప వాళ్ళనిమనం వారిని తు చా గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యతయని అంతే కాకుండా కుటుంబంలో ఉన్నటువంటి అక్క,చెల్లెలు, తల్లి ఇలా అందరిని కూడా ప్రతి ఒక్కరిని అను నిత్యం గౌరవించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉపాధ్యాయ విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉపాధ్యాయులు అయినటువంటి ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి జ్యోతి, జూనియర్ అసిస్టెంట్ శ్రీమతి కోమలి , పాఠశాలలో అటెండర్లుగా పనిచేస్తున్నటువంటి మహిళా మణులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్. పవన్, ప్రసాద్ .ఎస్ శ్రీనివాస్,రాజశేఖర్, రాజనర్సయ్య, రాజేందర్, కే .శ్రీనివాస్, విజయ్, గంగాధర్, ప్రవీణ్ శర్మ, ట్వింకిల్, గంగా మోహన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు