Listen to this article

బిచ్కుంద మార్చి 8 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది కవాతు నిర్వహించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నుండి మొదలై అంబేద్కర్ చౌరస్తా మీదుగా కమ్మర్ గుడి వరకు రాపిడ్ ఫోర్స్ సిబ్బంది కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ జగడం నరేష్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ డిప్యూటీ కమాండెంట్ టిపి బగేల్, ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, 40 మంది రాపిడ్ ఫోర్స్ సిబ్బంది పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.