Listen to this article

జనం న్యూస్ 08 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ఈ నెల 14వ తేదీన ఫిఠాపురంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకకు ఆహ్వానం పలుకుతూ శుక్రవారం విజయనగరం బాలాజీ నగర్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు అవనాపు విక్రమ్, డాక్టర్ అవనాపు భావన దంపతులు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ దంపతులు మాట్లాడుతూ ఫిఠాపురంలోని చిత్రాడ లో జరిగే జనసేన అవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. హాలో విజయనగరం..ఛలో పిఠాపురం..అంటూ జనసేన కేడర్ ను ఆహ్వానిస్తూ ముద్రించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. అనంతరం విజయనగరం నియోజకవర్గం కు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు నగరంలోని కోట, గంట స్ధంభం, ఎత్తు బ్రిడ్జ్ ప్రాంతాల్లో జనసేన పార్టీ అవిర్భావ దినోత్సవ పోస్టర్ లతో ప్రచారం చేశారు.