

జనం న్యూస్ మార్చి 8 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ బిఆర్ఎస్ కార్యకర్తలు ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నారని వారిని కాపాడుకుంటూ ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అలాగే కార్యకర్తలకు అండగా ఉండాలని సూచించారు నాడు అభివృద్ధికి ఎక్కడా ఇబ్బంది లేకుండా కోట్ల రూపాయలతో అనేక పార్కులు, స్మశాన వాటికలు, రోడ్లు.నిధులు కొరత లేకుండా అభివృద్ధి చేసుకున్నామని కానీ నేడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను ప్రజలకు వివరిస్తూ. జరిగిన అభివృద్ధిని బేరీజు వేస్తూ వారికి వివరించాలని సూచించారు రాబోయే వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్లాలని తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ కార్పొరేటర్లు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు