జనం న్యూస్ అక్టోబర్ 11 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ శివారులో మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న ఆసియాలోని రెండవ అతిపెద్ద శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం మంజీరా నదిలో స్నానమాచరించి అమ్మవారికి భక్తులు మొక్కులు, చెల్లించుకున్నారు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహించారు తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఓడి బియ్యం సమర్పణ చేశారు అమ్మవారు దసరా నవరాత్రులు సందర్భంగా ప్రత్యేక అలంకరణ ఒకటే అవతారంలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తుంది నేటి నుండి సోమవారం వరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు తేదీ 11 ఆదివారం నుండి తేదీ 19 సోమవారం వరకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఉదయము జపములు పారాయణులు మహా పూజ మహా నివేదన హారతి తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది. విజయదశమి సాయంత్రం షమీ పూజ అపరాధిత మహా పూజ తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ఇతర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు అని ఆలయ అర్చకులు ప్రభాకర్ శర్మ మోతిలాల్ శర్మ సుబ్రహ్మణ్య శర్మ ఆలయ సభ్యుడు శోభన్ బాబు ఒక ప్రకటనలో తెలియజేశారు భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు ఓం శ్రీమాత్రే నమః