Listen to this article

జనం న్యూస్ // మార్చ్ // 8 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. ప్రపంచ మహిళ దినోత్సవం గ్రామ నవనిర్మాణ సమితి కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంట ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది.ఈ సమావేశం ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో పని చేస్తున్న మహిళల జమ్మికుంట సైదాపూర్ మండలాల ఉద్యోగులు మరియు మహిళలు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా గృహవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రశాంతి , సుప్రజా మరియు ప్రకృతి వ్యవసాయ కోఆర్డినేటర్ కుమార్ స్వామి మాట్లాడుతూ..సృష్టిలో మహిళ యొక్క ప్రాధాన్యత మహిళలు వివిధ రంగాలలో సాధించిన విజయాలు మహిళ రైతుల గురించి ప్రాజెక్టులో మహిళా ప్రాధాన్యత గురించి వివరించారు . నేటి సమాజంలో పురుషులకు సమానంగా దీటుగా మహిళలు ముందంజలో ఉంటున్నారు అని అన్నారు.గృహ విజ్ఞాన శాస్త్రవేత్త . ప్రశాంతి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులలో మహిళ యొక్క పాత్ర మరియు దేశంలో అన్ని స్థాయిలో ఉన్న ఆర్థికవేత్త మరియు రాష్ట్రపతి వారి యొక్క విజయాలను వివరించారు. రాబోయే కాలంలో మహిళ అన్ని రంగాలలో ముందు ఉండాలని తెలిపారు.క్లస్టర్ కోఆర్డినేటర్ అశోక్ మాట్లాడుతూ…మహిళలు ఉన్నత శిఖరాలను అతిరోహించడం వారి యొక్క ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వివరించారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలను తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిలోక ము ఆర్థిక శక్తి ఎదగాలని చెప్పారు.మహిళలు ఆటపాటలతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఫామ్ సబ్జెక్టు బి ఆర్ సింగ్, సుప్రజ ప్రకృతి వ్యవసాయ ఫీల్డ్ స్టాప్ మహిళలు పాల్గొనడం జరిగింది.