Listen to this article

సుదర్శన చక్రానికి జలాభిషేకాలు -ప్రత్యేక అలంకారంలో శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం -అన్న ప్రసాద దాతలు అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు కుటుంబ సభ్యులు జనం న్యూస్, మార్చ్ 9( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవములు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.రెండవ రోజు శనివారం సుదర్శన చక్ర ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఉదయం మూలవిరాట్ కు మహాస్నాపనము,సుదర్శన హోమం,ధాన్య,పూల ఫల,శేయ్యధివాసములు వేద పండితులు తిగుళ్ల సనాతన సారధి మంత్రోచ్ఛనులతో ఆలయ వ్యవస్థాపకులు హనుమంతరావు గీత పతులు,తలకొక్కుల రాములు పద్మ దంపతులు,మురికి శ్యాంసుందర్ రావు అరుణ దంపతులు,యంసాని శ్రీనివాస్ సంతోషి దంపతులు నిర్వహించారు.పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సుదర్శన చక్రానికి జలాభిషేకాలు నిర్వహించారు.అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం అన్న ప్రసాద దాతలు అర్థం జ్యోతి లక్ష్మణ్ దంపతులు కుటుంబ సభ్యులు నిర్వహించారు.ఈ కార్యక్రమనికి కీ.శే అష్టకాల నరసింహ శర్మ కుమారుడు అష్టకాల విద్యా సాగర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు దేశాయి రాజశేఖర శర్మ,కార్తీక్ శర్మ,చకిలం పుండరీకం,బెల్దే కృష్ణమూర్తి,మండల బిఆర్ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్,బేతి వెంకటరెడ్డి,బేతి నరేందర్ రెడ్డి,బేతి కిష్టారెడ్డి,గచ్చుబాయి సాధుల్ల గౌడ్,బెల్దె అశోక్,కాచం శ్రీనివాస్,బెల్దె వెంకటేష్,బచ్చు ఆంజనేయులు,ఉప్పరి నర్సింగరావు,ఎడెల్లి మల్లేశం,కిష్టగౌడ్,అంబుగౌడ్,బేతి మధుసూదన్ రెడ్డి,తలకొక్కుల ప్రభాకర్,బేతి భాను ప్రకాష్ రెడ్డి,జర్నలిస్ట్ ముమ్మడి దొడ్డచారి,సోమ వెంకటేశం,రవి,శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భక్త బృందం,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.