Listen to this article

జనం న్యూస్ మార్చ్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు 80 వ డివిజన్ ఓల్డ్ 25వ వార్డ్ ఎన్టీఆర్ నగర్లో రోడ్డు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ దృష్టికి తీసుకొని రాగా తక్షణం ఆ రోడ్డు పనులు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు రోడ్డు పనులు ప్రారంభించేందుకు పనులు పరిశీలిస్తున్న 80 వ డివిజన్ టిడిపి ఇన్చార్జ్ బి ఎస్ ఎం కె జోగి నాయుడు, 80 డివిజన్ జనసేన నాయకులు, బుద్ధ శ్రీనివాసరావు, ఓల్డ్ 25 వ వార్డు టిడిపి అధ్యక్షులు కాండ్రేగులరాజు, తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా జోగి నాయుడు మాట్లాడుతూ పనుల విషయంలో నాణ్యత విషయంలో ఎక్కడ పొరపాట్లు జరగకూడదని, ప్రజలకు మేలు చేయటానికి కుటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ,ప్రజల ఇబ్బందులను గుర్తించి తక్షణం రోడ్డు పనులు జరిగే విధంగా చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ కి ,పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కి అనకాపల్లి టిడిపి ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణకి అనకాపల్లి జనసేన ఇన్చార్జ్
భీమర శెట్టి రామ్కికి కూటమి నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.