

జనం న్యూస్,మార్చి08, అచ్యుతాపురం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్సై సుధాకర్ రావు ఆధ్వర్యంలో అచ్యుతాపురం స్టేషన్ నుండి నాలుగు రోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు.వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు.ఎస్ఐ సుధాకర్ రావు
మహిళలందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ
గత సంవత్సరం నుండి ఉమెన్ అవేర్నెస్ క్యాంప్, ఎస్సే రైటింగ్, క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నామని,
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని,
మహిళల నుండి ఏ విధమైన ఫిర్యాదు వచ్చిన దాన్ని త్వరితగతన తీసుకుంటామని అన్నారు.