

పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర జనం న్యూస్,పార్వతీపురం మన్యం, మార్చి 8, (రిపోర్టర్ ప్రభాకర్): పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని అన్నారు. వంట గదికి పరిమితమైన మహిళలను చట్ట సభలో శాసనసభాపతి, మంత్రిని చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని అన్నారు. అలాగే రాష్ట్ర హోం మంత్రి, ప్రభుత్వ విప్ కూడా మహిళలేనని తెలిపారు. పురుషులతో పాటు మహిళలకు కూడా ఆస్తిలో సమాన హక్కు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, మహిళల కొరకు ప్రత్యేకంగా పద్మావతి యూనివర్సిటీ వంటివి ఈ ప్రభుత్వం హయంలోనే జరిగిందని అన్నారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటుచేసి మహిళలు సాధికారత సాధించేలా చేసిన సంగతిని ఆయన గుర్తుచేసారు. మహిళలు అమృతమూర్తులు, శక్తిమంతులని కొనియాడారు. ప్రతి కుటుంబంలో మహిళ పాత్ర అనితర సాధ్యమని, అటువంటి మహిళలను గౌరవించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అందుకే ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నామని వివరించారు.

