


జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్) మార్చి 9:రాయవరం మండలం వెదురుపాక ఆదిత్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ కోట బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులతో పాఠశాల పండగ వాతావరణం తలపించింది. పాఠశాల ప్రిన్సిపల్ మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కరస్పాండెంట్ కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల విద్యార్థులతో వివిధ రకాల సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం విద్యార్థినీ, విద్యార్థులతో తమ తల్లులకు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కోట బుజ్జి మాట్లాడుతూ మహిళలు అన్నింటా రాణించాలని, ప్రభుత్వం మహిళల కొరకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చారని, అసెంబ్లీ నుండి అంతరిక్షానికి సైతం మహిళలే ముందుకు సాగుతున్నారని విద్యార్థినులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.