సృజన మేకోవర్స్లో టిజిఆర్ జెసి హోతీ (కిె) విద్యార్థులకు దసరా ఇంటర్న్షిప్ శిక్షణ జనం న్యూస్ జహీరాబాద్, అక్టోబర్ 14 నియోజకవర్గ జహీరాబాద్ మండల హోతీ విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవాలనే లక్ష్యంతో సంగారెడ్డి జిల్లా, టిజిఆర్ జెసి హోతీ (కె) పాఠశాలకు చెందిన విద్యార్థులకు బ్యూటీ అండ్ వెల్నెస్ వృత్తి విద్యలో భాగంగా దసరా ఇంటర్న్షిప్ కార్యక్రమాన్ని జహీరాబాద్లోని సృజన మేకోవర్స్లో నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పాఠ్యపుస్త కాలకే పరిమితం కాకుండా, వృత్తి పరమైన నైపుణ్యాలను ప్రత్యక్షంగా నేర్చుకొని భవిష్యత్తులో స్వయం ఉపాధి పొందేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ సురేఖ. ఈ కార్యక్రమానికి ఎంతో సహకారం అందిస్తూ, విద్యార్థులు చదువుతో పాటు వృత్తి విద్యను అభ్యసించడం ఎంతో అవసరమని తెలియజేసి వారిని ప్రోత్స హించారు. వృత్తి విద్యా శిక్షకురాలు టి. భార్గవి ఆధ్వర్యంలో విద్యార్థులు ఇంటర్న్షిప్లో పాల్గొంటున్నారు. విద్యార్థులకు బ్యూటీ అండ్ వెల్నెస్ రంగంలో ఉపయోగించే వివిధ రకాల ఉత్పత్తులు, వాటి వినియోగం, థ్రెడింగ్, వ్యాక్సింగ్, డీ-టాన్ ఫేషియల్, హెన్నా అప్లికేషన్ వంటి అంశాలపై దశలవారీగా శిక్షణ అందిస్తున్నారు. విద్యార్థులు ప్రతి అంశాన్ని ఆసక్తిగా నేర్చుకుంటూ ప్రాక్టికల్ అనుభవాన్ని పొందుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వృత్తి విద్యా సమన్వయకర్త చైతన్య సందర్శించి విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించారు. వృత్తి విద్య ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, పనిపట్ల బాధ్యత, స్వయం ఉపాధిపై ఆసక్తి పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.